దీపం శోభాయమానం
మైసూరు: పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శైవ ఆలయాలు దీపారాధనతో విలసిల్లాయి. భక్తులు తెల్లవారుజామున, సాయంత్రం ఆలయాల్లో దీపాలు వెలిగించారు. దక్షిణ కాశీగా పేరొందిన జిల్లాలోని నంజనగూడులో వెలిసిన శ్రీ కంఠేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు సమర్పించి దైవ దర్శనం పొంది పునీతులయ్యారు. తెల్లవారుజామున నుంచే కపిలా నదిలో పుణ్యస్నానాలు చేసి క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని బంగారు ఆభరణాలు, నానావిధ పుష్పాలతో అలంకరించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, మహా మంగళ హారతి, ప్రత్యేక పూజలను నెరవేర్చారు. దాసోహ భవనంలో దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రత్యేక ప్రసాదం, అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.
నగరంలో
బెంగళూరులో సంపంగి రామనగరలోని కళ్యాణిలో వందలాది భక్తులు దీపారాధన చేశారు. వేలాది దీపకాంతులు నేత్రపర్వం గావించాయి.
చివరి కార్తీక సోమవారం విశేష పూజలు
Comments
Please login to add a commentAdd a comment