ఇద్దరు మహిళలకు రూ.59 లక్షల మస్కా
మైసూరు: రాచ నగరంలో మహిళలకు సైబర్ మోసగాళ్లు సులభంగా వల వేస్తున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వనితలకు అధిక లాభాల ఆశ చూపి రూ.59 లక్షలను వసూలు చేశారు.
కంపెనీలో పెట్టుబడులని
వివరాలు.. మొదటి కేసులో రాజీవ్‌నగరకు చెందిన మహిళ (28) కి టెలిగ్రాం యాప్‌లో ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఓ కంపెనీ గురించి తెలియజేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే భారీగా లాభాలు పొందవచ్చని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె తన భర్త ఖాతా నుంచి రూ.1.50 లక్షలను తీసుకుని పెట్టుబడి పెట్టింది. రెండు నెలల్లోనే ఆ మొత్తం రూ.3.30 లక్షలు అయినట్లు వాలెట్‌లో చూపింది. అయితే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా రూ.5.50 లక్షలను డిపాజిట్ చేస్తే మొత్తం సొమ్మును పొందవచ్చనడంతో ఆమె అలానే చేసింది. ఇలా దశల వారీగా మొత్తం రూ.30.78 లక్షలను పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు తెలిసింది.
క్రిప్టో కరెన్సీ అని రూ. 20 లక్షలు..
మరో ఘటనలో కావేరి బడావణెకు చెందిన మహిళ (33) కు పరిచయమైన ప్రభు అనే వ్యక్తి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే 20 నుంచి 25 శాతం మేరకు లాభాలు వస్తాయని నమ్మించి దశల వారీగా రూ.29 లక్షలను వసూలు చేశాడు. రెండు నెలలకు లాభంతో సహా రూ.9.07 లక్షలను మాత్రమే ఆమెకు వాపసు ఇచ్చాడు. ఆ తర్వాత అందుబాటులో లేకుండా ఫోన్ స్విచాఫ్ చేశాడు. రూ.20 లక్షలను కోల్పోయిన మహిళ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మైసూరులో సైబర్ మోసగాళ్ల పంజా
Comments
Please login to add a commentAdd a comment