కార్ల బాడుగ పేరుతో బ్లాక్మెయిల్
బనశంకరి: అమాయకులని అనిపిస్తే బెదిరించి దోచుకోవడానికి కొందరు వెనుకాడడం లేదు. అదే మాదిరిగా కారు అద్దెకు తీసుకున్న యువకులపై దాడి చేసి దోచుకున్న ముగ్గురు దుండగులను సోమవారం చంద్రాలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నితిన్, శశాంక్, వినోద్ పట్టుబడిన నిందితులు. వివరాలు.. గత వారం కొడగు టూర్‌కి వెళ్లడానికి ఐదుమంది యువకులు వినోద్ వద్ద కారు బాడుగకు తీసుకున్నారు. టూర్ తరువాత ఇద్దరు యువకులు వచ్చి కారును వెనక్కి ఇచ్చారు. కానీ వారిని నాగరబావిలో తన ఆఫీసుకు తీసుకెళ్లిన వినోద్.. 100 కిలోమీటర్ల వేగ పరిమితిని 120 సార్లు ఉల్లంఘించారు, దీని వల్ల రూ 1.20 లక్షల జరిమానా చెల్లించాలని బెదిరించాడు. అయితే చలానా చూపించాలని వారు అడగడంతో నితిన్, శశాంక్, వినోద్ చాకుతో బెదిరించి, ఫోన్ పే ద్వారా బలవంతంగా రూ.50 వేలు జమ చేయించుకున్నారు. సతాయించి అర్ధరాత్రి యువకులను వారి ఇళ్ల వద్ద డ్రాప్ చేశారు. బాధితులు చంద్రా లేఔట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, నిందితులను అరెస్ట్ చేశామని పశ్చిమ డీసీపీ గిరీశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment