ఎఫ్‌ఎస్‌టీలు అప్రమత్తంగా వ్యవహరించాలి | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎస్‌టీలు అప్రమత్తంగా వ్యవహరించాలి

Published Thu, May 9 2024 3:40 AM

ఎఫ్‌ఎస్‌టీలు అప్రమత్తంగా వ్యవహరించాలి

ఖమ్మం సహకారనగర్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తున్నందున ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు(ఎఫ్‌ఎస్‌టీ)లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఖమ్మం రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్‌ ప్రసాత్‌ కృష్ణసామి, శంకర్‌నంద్‌ మిశ్రాతో కలిసి ఎఫ్‌ఎస్‌టీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గౌతమ్‌ మాట్లాడుతూ స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ మద్యం, నగదు తరలివెళ్లకుండా చూడాలని తెలిపారు. వ్యయ పరిశీలకులు అరుణ్‌ప్రసాత్‌ కృష్ణసామి, శంకరనంద్‌ మిశ్రా ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులతో వెంటనే స్పందించడం ద్వారా వారిలో నమ్మకం కల్పించాలని తెలిపారు. ఆతర్వాత సీ–విజిల్‌ యాప్‌కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారంపై సమీక్షించారు.

అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి చేసినట్లు ఆర్‌ఓ, కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. వివిధ పార్టీల నాయకుల సమక్షాన కలెక్టరేట్‌లో నిర్వహించిన ర్యాండమైజేషన్‌ను ఆయన పరిశీలించి మట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గానికి కేటాయించిన 19 ఈవీఎంల కంట్రోల్‌ యూనిట్లు మరమ్మతుకు రావడంతో రిజర్వ్‌ యూ నిట్లను ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించామని తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ నోడల్‌ అధికారి, సీపీఓ ఏ.శ్రీనివాస్‌, వ్యయ నోడల్‌ అధికారి మురళీధర్‌రావు, ఉద్యోగులు రాంబాబు, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. కాగా, డీఈఓ సోమశేఖరశర్మతో కలిసి ఉపా ధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమైన కలెక్టర్‌ గౌతమ్‌ ఎన్నికల విధినిర్వహణలో తీసుకో వాల్సిన జాగ్రత్తలు, ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.

రిటర్నింగ్‌ ఆఫీసర్‌, కలెక్టర్‌

వీ.పీ.గౌతమ్‌

Advertisement
Advertisement