ఖమ్మం సహకారనగర్: ఖమ్మం గొల్ల గూడెంలోని చెరుకూరి వారి మామిడితోటలో 3వ తేదీ ఆదివా రం జరగనున్న ఉద్యోగుల సమ్మేళనం, వనసమారాధన ఏర్పాట్లను టీజేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన వేదికతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ఇంకో వేదిక ఏర్పాటుచేస్తుండగా భోజనాలు, పార్కింగ్‌కు ఏర్పా ట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, టీఎన్జీవోస్ నాయకులు గుంటుపల్లి శ్రీనివాస్, జయపాల్, కొమరగిరి దుర్గాప్రసాద్, గంగవరపు బాలకృష్ణ, రమేష్, తాల్లూరి శ్రీకాంత్, సగ్గుర్తి ప్రకాశ్‌రావు, ముఖీద్ పాల్గొన్నారు. కాగా, ఉద్యోగుల ఐక్యతను చాటేందుకు ఆదివారం వన సమారాధన నిర్వహిస్తున్న జేఏసీ మహిళా విభాగం నాయకులు ఉషశ్రీ, సుధారాణి, లలితకుమారి వెల్లడించారు. టీన్జీవోస్ భవన్ వద్ద బుధవారం నిర్వహించిన మహిళా ఉద్యోగుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈసమావేశంలో లలితమ్మ, పద్మజ, రోజా, స్వరూప, నాగమణి, షమ్మి, శ్వేత పాల్గొన్నారు.
బాలుడిపై లైంగిక దాడి కేసులో జైలుశిక్ష
ఖమ్మం లీగల్: జామపండ్లు కోసి ఇస్తానని నమ్మించి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కె.ఉమాదేవి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథ నం ప్రకారం వివరాలు.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఎస్.కే.ఖాదర్ అలీ ఖమ్మం మోమినాన్ బజార్‌లో నివాసముంటున్నాడు. 2021 నవంబర్ 27న పని నిమిత్తం నిజాంపేటకు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమె తమ ఇంట్లో జామపండ్లు ఉన్నాయని, పిల్లలు ఉంటే చెట్టు ఎక్కించొచ్చని పక్క ఇంట్లో నివా సం ఉండే బాలుడి తల్లికి తెలిపింది. దీంతో బాలుడిని పంపించగా ఖాదర్ అలీ కాసేపటికి ఎవరూలేని సమయాన లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈమేరకు ఇంటికి వచ్చాక తల్లికి చెప్పడంతో డిసెంబర్ 1న ఖమ్మం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోక్సో చట్టం కింద పోలీసులు ఖాదర్‌ను అరెస్ట్ చేయగా, విచారణ అనంతరం ఆయనకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ ఎ.శంకర్ వాదించగా, రషీద్, అయూబ్ సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment