ఖమ్మంమయూరిసెంటర్: రైతులు పండించిన పత్తి మొత్తాన్ని ఎలాంటి షరతులు లేకుండా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం(ఏఐపీకేఎస్) రాష్ట్ర నాయకుడు గుర్రం అచ్చయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గిన నేపథ్యాన రైతులు నష్టపోకుండా పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. ఈమేరకు 4వ తేదీన ఖమ్మం మార్కెట్ ఎదుట నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కోలేటి నాగేశ్వరరావు, కమ్మకోమటి నాగేశ్వరరావు, కేలోతు లక్ష్మణ్, మారుతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన ఆర్డీఓ నర్సింహారావు
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం ఆర్డీఓగా జి.నర్సింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ పని చేస్తున్న గణేష్‌ను తొర్రూరు ఆర్డీఓగా బదిలీ చేయగా, ఖమ్మం ఆర్డీఓగా నర్సింహారావును ఇటీవల నియమించిన విషయం విదితమే.
విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంతో పాటు విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఖమ్మం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద బుధవారం చేపట్టిన దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. దీక్షకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మద్దతు తెలిపారు. నాయకులు తుడుం ప్రవీణ్, సీహెచ్.రమేష్, సుధాకర్, సాయి, శేషు, ఉమేష్, రాగిణి, శ్రీలత, సంతోష్, మణికంఠ, తరుణ్, వంశీ, పూజిత, సింధు, స్వాతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment