భద్రాచలంటౌన్: ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న ఎండు గంజాయిని ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను భద్రాచలం ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎకై ్సజ్ అధికారి జానయ్య వెల్లడించారు. భద్రాచలంలోని కూనవరం రోడ్డులో అధికారులు వాహన తనిఖీ చేపట్టగా రెండు ఆటోల్లో తరలిస్తున్న 118 కిలోల ఎండు గంజాయి దొరికింది. ఆటోల్లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు పారిపోగా, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని జానయ్య తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ గౌతమ్, ఉద్యోగులు రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, గురవయ్య, సుమంత్, శ్రావణి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘సింగరేణి ఉద్యోగాల
నోటిఫికేషన్ అవాస్తవం’
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఇల్లెందు ఏరియాలోని ఓసీల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోిటిఫికేషన్‌లో నిజం లేదని జీఎం పర్సనల్(వెల్ఫేర్ అండ్ ఆర్సీ) శామ్యూల్ సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను పత్రికల ద్వారా ప్రకటిస్తామే తప్ప సోషల్ మీడియాలో విడుదల చేయమని చెప్పారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న నోటిఫికేషన్ అంశాన్ని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై సింగరేణి విజిలెన్స్ విభాగం విచారణ చేపడుతోందని జీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment