ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) ఖమ్మం రూరల్ బ్రాంచిలో అవినీతి, అక్రమాలకు బాధ్యుడిగా మేనేజర్ ఉపేంద్రనాధ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో ఈ బ్రాంచ్ ద్వారా 16 మందికి రూ.10లక్షల చొప్పున రూ.1.60 కోట్ల మేర నకిలీ ధ్రువపత్రాలతో దీర్ఘకాలిక మార్టిగేజ్ రుణాలు ఇచ్చినట్లు తేలగా, రుణ బకాయిలు వడ్డీతో కలిపి రూ.3 కోట్లకు చేరా యి. కాగా, ప్రస్తుతం ఎన్‌ఎస్‌టీ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఉపేంద్రనాధ్‌ను సస్పెండ్ చేస్తూ సీఈఓ వి.వసంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో బీఎంగా సృజనను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment