కొనుగోలు కేంద్రాల పరిశీలన
కల్లూరురూరల్: మండలంలోని పుల్లయ్యబంజర్, లక్ష్మీపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ సన్యాసయ్య ఆదివారం పరిశీలించారు. రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ధాన్యం విక్రయిస్తున్న రైతులకు సంబంధించిన డేటా ఎంట్రీలను, ట్రక్కు షీట్లు, గన్నీ బస్తాల సరఫరాకు సంబంధించిన వివరాలను ఆయన తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం వెంకటరామారావు, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు నగరానికి చెందిన పూనటి అలోక్ ఎంపికయ్యాడు. లాంగ్‌జంప్‌లో అత్యుత్తమ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం అభిందనీయమని కోచ్ ఎండీ గౌస్, జిల్లా అథ్లెటిక్స్ అసోయేషన్ కార్యదర్శి ఎండీ షఫీక్‌అహ్మద్ తెలిపారు.
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ గ్రామానికి చెందిన గంధం ఆకాష్ (21) పురుగులమందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెంది ఆకాష్ శనివారం గడ్డి మందు తాగాడు. చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు.
మోసం చేసినవారిపై కేసు
పాల్వంచ: చిట్టీ వేయించుకుని డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగిన ఇద్దరిపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బొల్లేరుగూడెంనకు చెందిన తాళ్లూరి కృష్ణకుమారి, ఆమె కూతురు దీపికకు గట్టాయిగూడెంనకు చెందిన దొడ్డ బాలాజీ, కొలిపాక సాయిరాం కలిసి మాయమాటలు చెప్పి రూ.5లక్షల చిటీ వేయించారు. 30 నెలలు కట్టిన తర్వాత చిట్టీ డబ్బులు అడుగగా ఇవ్వకుండా ఆరు నెలలుగా తిప్పుకుంటున్నారు. ఈ విషయమై అడిగేందు కు దీపిక వెళ్లగా డబ్బులు ఇచ్చేది లేదని దూషించారు. చంపు తామంటు బెదిరించారు. దీంతో కృష్ణకుమారి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment