గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు

Published Wed, May 8 2024 11:50 PM

గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు

ఆసిఫాబాద్‌రూరల్‌/రెబ్బెన: ఆసిఫాబాద్‌ మండలంలోని అప్పపల్లి, బూర్గుడ, కొమ్ముగూడ, గొల్లగూడ, ఈదులవాడ, సింగరపేట్‌, చిర్రకుంట, ఖైర్‌గాం, రెబ్బెన మండలంలోని నంబాల, చిలుకమర్రిగూడ, రాజారాం, కొమురవెళ్లి, కిష్టాపూర్‌, ఎడవెల్లి, కై రిగాం, నక్కలగూడ, పుంజుమేరగూడ, నంబాల గ్రామాల్లో అకాల వర్షం వరి పంటకు నష్టం చేకూరింది. రెబ్బెన మండలంలో సుమారు 50 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే పులికుంట, నంబాల, ధర్మారం, గోలేటి ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మరో 15 రోజుల్లో వరి కోతలు పూర్తవుతాయని అనుకున్న సమయంలో పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టంపై సర్వే చేపట్టి ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు డిమాండ్‌ చేశారు. మండలం యూనిట్‌గా కాకుండా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సర్వే చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement