భీం ఆశయ సాధనకు కృషి
పెంచికల్పేట్(సిర్పూర్): కుమురంభీం ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్, భీం మనుమడు సోనేరావు అన్నారు. మండలంలోని పోతపల్లి గ్రామంలో ఆదివారం కుమురంభీం విగ్రహం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఆదివాసీలు అణచివేతకు గురవుతున్నారని, హక్కుల సాధనకు ఐక్యమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఐదో షెడ్యూల్ రాష్ట్రంలో అమలుకావడం లేదన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య, డీఎంహెచ్‌వో సీతారాం, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, నాయకులు సిడాం అర్జు మాస్టర్, మడావి శ్రీనివాస్, సోయం చిన్నయ్య, తలండి మధుకర్, సిడాం మల్లేశ్, కుర్సింగ మోతీరాం, శ్రీదేవి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment