‘సమస్యల పరిష్కారానికి పోరాటం’
ఆసిఫాబాద్‌రూరల్: ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారం కోసం పోరాడుతామని ఎస్‌టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌టీయూ భవనంలో ఆదివారం సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెగ్యులర్ డీఈవోను నియమించాలని, స మగ్ర శిక్షా ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్ మెడికల్ బిల్లులు విడుద ల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటుహక్కు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌టీయూ రాష్ట్ర కౌన్సిలర్ సంజయ్ కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాణిక్‌రావు, తుకారాం, నాయకులు సులేమాన్ జబ్బార్, లక్ష్మణ్, నగేశ్, సంతోష్, అనూష, భాస్కర్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment