సామాజిక విప్లవకారుడు పూలే
ఆసిఫాబాద్‌అర్బన్: అణగారిన వర్గాల్లో అక్షర జ్యోతిని వెలిగించిన సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే అని మాలి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగోసె శంకర్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా గురువారం ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద బీసీ సంక్షేమ సంఘం, ఎమ్మార్పీఎస్, రైతు సంఘం, యువజన సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అ నేక పాఠశాలలు స్థాపించి అంటరానివారికి చదువు నేర్పారని కొనియాడారు. ప్రతిఒక్క రూ మహనీయుల బాటలో నడవాలని సూ చించారు. కార్యక్రమంలో నాయకులు రూప్ నార్ రమేశ్, కేశవ్‌రావు, మారుతి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
4న జాతీయ సాధన సర్వే పరీక్ష
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో వచ్చే నెల 4న జాతీయ సాధన సర్వే నిర్వహిస్తున్నట్లు డీఈ వో యాదయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ముదింగంటి సూరమ్మ బీఈడీ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులకు గురువారం ఇన్విజిలేషన్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఫీల్డ్ ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించేవారు విద్యార్థులు ఓఎంఆర్ షీట్లలో తప్పిదాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 8 గంటలకే ఆయా పాఠశాలలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, పరీక్ష విభాగం కార్యదర్శి వెంకటేశ్వరస్వామి, రిసోర్స్‌పర్సన్లు శాంతికుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment