ఉద్యోగుల కోసమే బస్సు సౌకర్యం
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగుల కోసమే గోలేటి, మంచిర్యాల మధ్య ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించినట్లు ఏరియా జీఎం శ్రీనివాస్ తెలిపారు. గోలేటిలోని జీఎం కార్యాలయం వద్ద గురువారం బస్సు సేవలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏరియాలోని సింగరేణి ఉద్యోగుల అభ్యర్థన మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మంచిర్యాల, గోలేటి మధ్య బస్సు ఏర్పాటు చేయించామని తెలిపారు. జీఎం కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతోపాటు గోలేటి పరిసర ప్రాంతాల ఉద్యోగులు, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బస్సు సేవల పునరుద్ధరణకు కృషి చేసిన ఆర్ఎం సోలోమాన్, మంచిర్యాల డిపో మేనేజర్ జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బయ్య మొగిళి, పీవో నరేందర్, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, ఇంజనీరు భీంరావు జాడే, పీఈ వీరన్న, సివి ల్ ఎస్ఈ మదీనా బాషా, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment