న్యూస్‌రీల్‌ | - | Sakshi
Sakshi News home page

న్యూస్‌రీల్‌

Published Mon, Nov 25 2024 7:51 AM | Last Updated on Mon, Nov 25 2024 7:51 AM

-

పశువులపై పెద్దపులి దాడి

వాంకిడి(ఆసిఫాబాద్‌): వాంకిడి మండలం బండకాస, దాబా గ్రామాలకు చెందిన ఐదు పశువులపై ఆదివారం పెద్దపులి దాడి చేసిన ట్లు ఆసిఫాబాద్‌ ఎఫ్‌ఆర్వో గోవింద్‌సింగ్‌ సర్దా ర్‌ తెలిపారు. ఉదయం అటవీ ప్రాంతాలకు పశువులు మేతకు వెళ్లగా పులి దాడి చేసిందన్నారు. గాయపడిన పశువులకు పశువైద్యుడితో చికిత్స అందించామన్నారు. అనంతరం బండకాస గ్రామంలో అటవీ, వణ్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను రక్షించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా అధికారులకు సహకరించాలని కోరారు. పులి దాడిలో పశువులు మృతి చెందితే తక్షణ సాయం కింద రూ.8000 చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సవాతి మాజీ సర్పంచ్‌ దేవ్‌రావు, డీఆర్వో సరోజరాణి, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement