ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
ఆసిఫాబాద్‌రూరల్: ఆర్థికంగా వెనుబడిన విద్యార్థులకు 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రతిభ గల వారిని గుర్తించేందుకు ఏటా 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రంలో ఆదివారం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని బాలురు, బాలికల ఉన్నత పాఠశాలల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 483 మంది విద్యార్థులకు 431 మంది హాజరు కాగా, 52 మంది గైర్హాజరయ్యారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు తెలిపారు. సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment