సర్వే వివరాల నమోదు కీలకం
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపడుతు న్న కుటుంబ సమగ్ర సర్వేలో సేకరించిన సమాచారాన్ని సక్రమంగా నమోదు చేయడం కీలకమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఆదివారం సమగ్ర సర్వేపై సమీక్షించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సర్వే చివరి దశకు చేరుకుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా డాటా ఎంట్రీ చేయాలని సూ చించారు. ఇంటి వద్ద యజమానులు లేకుంటే ఫోన్‌కాల్ ద్వారా వివరాలు సేకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర సర్వేకు ఎన్యుమరేటర్లు రాని పక్షంలో తెలియజేసేందుకు కంట్రోల్ రూం నం.63046 86505 ఏర్పాటు చేశామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్‌కు తెలిపినా వివరాలు నమోదు చేసేలా చర్యలు చేపడతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment