● ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న బుధవారం ఆలయ వార్షికోత్సవం నిర్వహించి ఉత్సవాలు ప్రారంభిస్తారు.
● 28న క్షేత్రాధి దేవతల ప్రత్యేక పూజలు, ఉదయం 10 గంటలకు దేవస్థాన కాలసూచి ఆవిష్కరణ, 12 గంటల నుంచి మహాప్రసాద వితరణ, కార్యక్రమాలు నిర్వహిస్తారు.
● 29న ఉదయం 10.30 గంటలకు అమ్మవారికి శ్రీచక్రనవ వర్ణ కుంకుమార్చన, మహా మంగళ హారతి, మంత్ర పుష్పం.
● 30న ఉదయం 9గంటల నుంచి అర్చకబృందం ఆధ్వర్యంలో కంకలమ్మ దేవి మహాయజ్ఞం, కూష్మాండ బలిహారణము, కళా న్యాసము, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మహాపూర్ణాహుతి, అపబృధ స్నానము, మహధాశీర్వచనం, మహాత్ముల ఆశీర్వాద భాషనం, గిరి ప్రదక్షిణ, విజయ ఘోష.
● డిసెంబర్ 1న అమావాస్య రోజు క్షేత్రాధి దేవతలు శ్రీస్వయంభూ కేతేశ్వర కంకలమ్మ దేవి అమ్మవార్లకు శతఛిద్ర మహాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజ, భక్తులకు మూల విరాట్ సందర్శనం, జాతర మహోత్సవం.
● 2న అభిషేకం, అర్చనలు, జాతర మహోత్సవం.
● 3న ఉదయం 5.30గంటలకు దేవతలకు అభిషేకాలు, షోడశోపచారాం.
Comments
Please login to add a commentAdd a comment