రాజ్యాంగంతో ప్రతిఒక్కరికీ న్యాయం
● సీనియర్ సివిల్ జడ్జి కె.యువరాజ్
ఆసిఫాబాద్‌అర్బన్: రాజ్యాంగంతోనే దేశంలోని ప్రతిఒక్కరికీ హక్కులు, న్యాయం అందుతాయని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని లుంబినీ బౌద్ధ విహార్ ప్రాంగణంలో ఆదివారం రాజ్యాంగ దినోత్సవం, మహోన్నత రాజ్యాంగంపై చర్చ నిర్వహించారు. ముందుగా సమతా భారత్ ఐక్య వేదిక పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం మహోన్నతమైందన్నారు. మా రుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కోర్టులో వాదనలు లైవ్‌లో తిలకించే అవకాశం ఉందన్నారు. ఆసిఫాబాద్ ప్రాంతంలో గంజాయి, పోక్సో కేసులు నమోదు కావడం బాధాకరమని పే ర్కొన్నారు. యువత పెడదారి పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ గోపినాథ్, సోషల్ యాక్టివిస్ట్ నిర్మల, సెంట్రల్ కమిటీ అధ్యక్షులు దుర్గం హూక్టు, ఆర్డీసీ డీఎం విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ భుజంగ్‌రావు, నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment