పెదకాకాని: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట బైబిల్ మిషన్ మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు నాలుగురోజులపాటు జరగనున్నాయి. రాష్ట్ర నలుమూలలతోపాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. తొలుత కాకాని స్వస్తిశాల సంగీత బృంద సభ్యులు ప్రత్యేక క్రైస్తవ భక్తి కీర్తనలు ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జె శామ్యేల్ కిరణ్ వాక్యోపదేశం చేశారు. క్రీస్తు బోధనలను వివరించారు. బైబిల్ మిషన్ సెక్రటరీ రెవరెండ్ కె.ప్రశాంత్ కుమార్, రెవరెండ్ రాజు, రెవరెండ్ పి.ప్రకాష్ ఓనేసం, రెవరెండ్ సత్య ప్రకాష్, రెవరెండ్ డాక్టర్ డేనియల్ దినకర్‌లు దైవ సందేశాలు అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, కేరళ, బిహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో మహోత్సవాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment