తిరువూరు: ఏ కొండూరు మండలం పోలిశెట్టిపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం.. గంజాయి రవాణా గుట్టును రట్టు చేసింది. తిరువూరు నుంచి విజయవాడ వైపు ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తున్నారు. వారు ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా ఢీకొట్టారు. బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గాయపడగా 108 అంబులెన్సులో తిరువూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్రమాదానికి కారకులైన యువకుల వద్ద బ్యాగులో మూడు ప్యాకెట్ల గంజాయి, కత్తి లభ్యమైంది. దీనిపై స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించగా వారు వచ్చేలోపు యువకులు పరారయ్యారు. ద్విచక్ర వాహనాన్ని, గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment