కొలిమిగుండ్ల: పెట్నికోటలో పోలింగ్ బూత్ వద్ద జరిగిన దాడి కేసులో 29 మంది టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు సీఐ గోపీనాథ్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఈనెల 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గ్రామంలోని 14వ బూత్ వద్ద ఓటు వేసేందుకు నరిగి మద్దిలేటి, వెంకటరాముడు, అలివేలమ్మ, తుడుము పెద్దయ్య, గుర్రం రామచంద్రుడుతో పాటు కొంత మంది క్యూలైన్‌లో నిల్చున్నారు. అదే సమయంలో టీడీపీ నాయకులు అక్కడికి చేరుకొని టీడీపీకి ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. తమకు నచ్చిన వారికి ఓటు వేసుకుంటామని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహానికి లోనైన టీడీపీ నాయకులు కులం పేరుతో దూషిస్తూ తమకే ఎదురు చెబుతారా అంటూ రాళ్లతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు ఐవీ ఫక్కీరారెడ్డి, మూలె రామేశ్వరరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, గొంగటి హుశేన్‌రెడ్డి, గొంగటి నారాయణరెడ్డి, యాతం సత్యనారాయణరెడ్డి, కొప్పుల వెంకట శివారెడ్డి, నామాల నాగపుల్లయ్య, మెట్ట నాగార్జున, దూదేకుల హాజివలి, చాకలి శివాంజనేయులు, బూరుగల మౌలాలి, కదిరి శివకేశవరెడ్డితో పాటు మొత్తం 29 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment