ఉల్లి రైతుల సమస్యలు పట్టించుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం చేతకాక.. సరుకు ఎక్కువగా వస్తోందని సాకులు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు కమీషన్‌లపై చూపుతున్న శ్రద్ధలో కనీసం 40 శాతం రైతు సమస్యలపై దృష్టి పెడితే రైతులకు ఇన్ని ఇబ్బందులు ఉండవన్నారు. బుధవారం ఆయన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల ఎదుర్కొంటున్న కష్టాలను పరిశీలించారు. గంటకుపైగా మార్కెట్‌లో ఉండి రైతులతో ముఖాముఖి అయ్యారు. కాటసాని ఎదుట పలువురు రైతులు మార్కెట్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పంటను అమ్ముకొని వెళ్లడానికి మూడు, నాలుగు రోజులు పడుతోందని, ఇందువల్ల ఉల్లిగడ్డలు కుళ్లి దెబ్బతింటుండటంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కాటసాని విలేకరులతో మాట్లాడుతూ.. మార్కెట్‌కు ఉల్లి ఎక్కువగా వస్తున్నప్పుడు ఉద యం 9 గంటల నుంచే టెండరు ప్రక్రియ చేపడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు దాదాపు అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేశామని, పంట చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేసి భరోసా నింపడం జరిగేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతు లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వమే రైతుల నుంచి ఉల్లిని గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేసేది ౖవైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, కూటమి ప్రభుత్వంపై ఉన్న భ్రమలు నాలుగు నెలల్లోనే తొలగిపోయాయని పేర్కొన్నారు. అనతరం ఉల్లి రైతుల ఇబ్బందులపై మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మితో సమావేశమై చర్చించారు.
టీడీపీ నేతలు లిక్కర్ షాపులతో
బిజీగా ఉన్నారు..
తెలుగు దేశం నాయకులు లిక్కరు షాపులు, కమీషన్ల వేటలో బిజీగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని విమర్శించారు. రైతు సమస్యలపై దృష్టి సారిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో గ్రామాల్లోనే రైతులకు అన్ని రకాల ఎరువులు లభించేవని, నేడు ఎరువుల కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఆ తర్వాత రైతులు, ఇతర వర్గాల ప్రజలను పట్టించుకున్న పాపాన పోలే దని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్–6 హామీల అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. కాటసాని వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ బెల్లం మహేశ్వరరెడ్డి, కల్లూరు ఎంపీపీ శారద తదితరులు ఉన్నారు.
ముగిసిన ఆర్‌యూ బీఈడీ సెమిస్టర్ పరీక్షలు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు బుధవారం ముగిశాయి. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ నంద్యాలలోని నేషనల్ డిగ్రీ కళాశాల, నంద్యాల ప్రభుత్వ డిగ్రీకళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఈనెల 23వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 17 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయన్నారు. చివరి రోజు 4,479 మందికి 4050 మంది హాజరు కాగా 429 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు.
సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు
ఉదయం 9 నుంచే కొనుగోళ్లు
చేపట్టాలి
ఉల్లి రైతులకు అండగా నిలుస్తాం
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment