రెవెన్యూ ఉద్యోగులసమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని డీఆర్వో కె.వెంకట నారాయణమ్మ అన్నారు. బుధవారం డీఆర్వోను ఆమె కార్యాలయంలో ఏపీఆర్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, లక్ష్మీరాజు ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రెవెన్యూ ఉద్యోగులకు పదోన్న తులు, బదిలీలు, పెండింగ్‌లోని వేతనాలకు సంబంధిచిన పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఆమెసానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ రామాంజనేయరెడ్డి, జిల్లా ట్రెజరర్ ఐ.వేణుగోపాలరావు, నాయకులు సి.వెంకటేశ్వరరెడ్డి, లోకేశ్వరి, కృష్ణవేణి, రామాంజనేయులు, భాను, శివపార్వతి పాల్గొన్నారు.
4న డీడీఆర్‌సీ సమావేశం
కర్నూలు(సెంట్రల్): నవంబర్ 4వ తేదీన కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా ఇన్‌చార్జిమంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షతన డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ) సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీపీఓ హిమప్రభాకరరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి అభివృద్ధి మంత్రి సమీక్ష నిర్వహిస్తారని, కావున, అన్ని శాఖల అధికారులు తగు నివేదికలతో హాజరుకావాలని కోరారు.
నేరాల నియంత్రణకు సహకరించాలి
● ఎస్పీ బిందు మాధవ్
కర్నూలు (టౌన్): నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు.జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కర్నూలు హోల్‌సేల్ ట్రేడర్స్, కిరాణా మర్చంట్ అసోసియేషన్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్, బంగారు షాపు అసోసియేషన్లతో ఎస్పీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలు నగరంలో నేర నియంత్రణకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు అమర్చు కోవాలన్నారు. ఎవరైనా సమస్యలుంటే డయల్ 100 కు లేదా డయల్ 112 కు ఫోన్ చసి సమాచారం అందించాలన్నారు. ఫోన్‌కు వచ్చే అనవసర లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, కమాండ్ కంట్రోల్ సీఐ శివశంకర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు ఖాజావలి, మల్లికార్జున, హనుమంతయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment