57 కేంద్రాల్లో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | Sakshi
Sakshi News home page

57 కేంద్రాల్లో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Published Thu, May 23 2024 4:15 AM

57 కేంద్రాల్లో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 57 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎస్‌వీఎస్‌ గురువయ్యశెట్టి తెలిపారు. బుధవారం స్థానిక ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 2.30 సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు వచ్చే నెల 1వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఫస్ట్‌ ఇయర్‌ జనరల్‌ విభాగం నుంచి 15,076 మంది, వొకేషనల్‌ విభాగం నుంచి 905 మంది, సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు జనరల్‌ విభాగం నుంచి 6194 మంది, వొకేషనల్‌ విభాగం నుంచి 768 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో గది గదికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల్లో విద్యార్థులు ప్రశాంతగా పరీక్షలు రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 10 కేంద్రాలకు రవాణా సదుపాయం కల్పించాలని ఇప్పటీకే ఏపీ ప్రజా రవాణా వ్యవస్థ అధికారులను కోరామన్నారు. ప్రతి కేంద్రం దగ్గర 144 సెక్షన్‌లో అమలులో ఉంటుందన్నారు. కేంద్రాల్లోకి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్‌ టికెట్‌ మాత్రమే తెచ్చుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించేది లేదన్నారు. విలేకరుల సమావేశంలో డీఈసీ మెంబర్లు పరమేశ్వరరెడ్డి, లాలెప్ప, ప్రభుచరణ్‌ పాల్గొన్నారు.

జూన్‌ 2 నుంచి ఆన్‌లైన్‌లో మూల్యాంకనం

ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన అనంతరం జూన్‌ 2వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై అధ్యాపకులకు బుధవారం ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయం ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సుబ్బారావు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చారు. ప్రతి అధ్యాపకుడికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ బోర్డు నుంచే కేటాయిస్తారన్నారు. పరీక్షలు ముగిసిన తరువాత స్పాట్‌ కేంద్రం దగ్గర సమాధాన పత్రాలు స్కాన్‌ చేసి ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల యూజర్‌ ఐడీకి ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. అధ్యాపకులు ఇంటి దగ్గర కానీ, వారు పని చేసే కాలేజీల్లో ఎక్కడైనా మూల్యాంకం చేయవచ్చునని, అయితే వెబ్‌ కెమెరాలు ఉండాలన్నారు. ప్రతి రోజు ఉదయం 8 ల నుంచి రాత్రి 7 గంటల వరకు మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు. మూ ల్యాంకనానికి ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన సమాధాన పత్రాలు స్కానింగ్‌కి జిల్లాకు రానున్నాయి. అనంతరం ఆర్‌ఐఓ గురవయ్య శెట్టి మూల్యాంకనం చేసే విధానంపై అధ్యాపకులను పలు సూచనలు చేశారు.

కేంద్రాల్లో గదిగదికి

సీసీ కెమెరాల ఏర్పాటు

విలేకరుల సమావేశంలో ఇంటర్‌

బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి

Advertisement
 
Advertisement
 
Advertisement