రీసర్వే దరఖాస్తులను పరిష్కరించండి
కర్నూలు(సెంట్రల్): రీసర్వే సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్‌బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రీసర్వే సమస్యల పరిష్కారంపై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జేసీ డాక్టర్ బి.నవ్యను ఆదేశించారు. మ్యూటేషన్లను ఇస్టానుసారంగా చేయవద్దని, ఆర్‌ఓఆర్ యాక్ట్ ప్రకారం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. కర్నూలు అర్బన్‌లోని ఏ, బీ, సీ క్వార్టర్లలో ఎంత మేరకు ప్రభుత్వ భూమి ఉందనే వివరాలను తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వివిధ పనులకు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద గొర్రెల యూనిట్ల మంజూరుకు కేవలం 15 దరఖాస్తులు రావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లీడ్ బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి పురోగతి సాధించేలా చూడాలన్నారు. డివిజన్‌లో గుంతలు లేనిరహదారులను డిసెంబర్ 15వ తేదీలోపు చేయాలన్నారు. సమావేశంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.
సహకార వారోత్సవాలను
విజయవంతం చేయండి
ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేపట్టే 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆయన జేసీ డాక్టర్ బి.నవ్యతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వికసిత్ భారత్‌లో సహకార సంఘాల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఈనేపథ్యంలో ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమంతో ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఓ రామాంజనేయులు, సీఈఓ విజయకుమార్, డివిజనల్ కో ఆపరేటీవ్ అధికారిణి జఫ్రిన్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment