
వైభవంగా శ్రీరంగనాథ పార్వేట
మద్దికెర: పెరవలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథుడు ఉగాది సంబరాల్లో భాగంగా సోమ వారం స్వామి వారు పార్వేటను వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి బిందెసేవతో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని పల్లకీలో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామ శివారులోని గోదా చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ చెరువులో కుందేళ్లను వదిలి పట్టుకునే పార్వేట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వీరయ్యతోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వైభవంగా శ్రీరంగనాథ పార్వేట