No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 6:55 AM

No Headline

పెద్దవంగర: ప్రజలకు సేవ చేసేందుకే వరంగల్‌ పార్లమెంట్‌ నుంచి కడియం కావ్య పోటీ చేస్తున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్లు గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఇంటింటి వెళ్లి కడియం కావ్వ గెలుపు కోరుతూ ప్రచారం చేశారు. ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కూలీలను కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి ప్రతిపక్షాలను తరిమికొట్టాలని కోరారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని, ఆ పార్టీ నాయకుల మాయమాటలు విని ఓటు వేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు అండగా ఉంటే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ తోడుదొంగ పార్టీలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఆదరించినట్లుగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో కడియం కావ్యను ఆదరించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడుసురేష్‌, తొర్రూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ హరిప్రసాద్‌, సీనియర్‌ నాయకులు కేతిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎంపీపీ కల్పన, ఎంపీటీసీలు సౌజన్య, బానోతు రవీందర్‌, నాయకులు రవీందర్‌ రెడ్డి, రామకృష్ణరెడ్డి, హరికృష్ణ, కృష్ణ, శ్రీనివాస్‌, యాకయ్య, సైదులు, మహేష్‌, రజినీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement