అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా | Sakshi
Sakshi News home page

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా

Published Wed, May 8 2024 7:30 AM

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా

నయీంనగర్‌: దేశం మోదీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్‌ అన్నారు. మంగళవారం హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌లో అ ధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో అరూరి రమేష్‌ మాట్లాడారు. తనను ఆశీర్వదిస్తే మోదీ సహకారంతో వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య భర్తది గుంటూరు అని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ది కరీంనగర్‌ అన్నారు. కడియం శ్రీహరిది నీచ చరి త్ర అన్నారు. ఒకప్పుడు ఆయన ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ పార్టీ లో ఉన్నప్పుడు కొండా సురేఖకు టికెట్‌ రాకుండా చేశారన్నారు. తాను మూడో సారి గెలిస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిని అవుతానని, అందుకే తనను ఓడించడం కోసం కడియం శ్రీహరి కుట్రలు చేశాడన్నారు. దళిత దొర హయాంలో పేద బిడ్డల ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌రె డ్డి వరంగల్‌లో మూడుసార్లు ప్రచారానికి వచ్చారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నాన్‌ లోకల్‌ అని, తాను ఒక్కడినే లోకల్‌ దళిత బిడ్డనని, వరంగల్‌ ప్రజలు తనకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలవగానే వరంగల్‌ను అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేస్తానన్నా రు. వరంగల్‌ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మామునూరు ఎయిర్‌పోర్టు, వరంగల్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, పాలకుర్తి–కొడకండ్లలో టెక్స్‌టైల్‌ పార్క్‌, మడికొండలో ఐటీ హబ్‌ ఎక్స్‌పాన్షన్‌, భూపాలపల్లి–పరకాల రైలు మా ర్గం, ఏనుమాముల మార్కెట్‌ ఆధునీకరణ, అనేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. తనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రజలు బీజేపీని ఆదరించి మోదీని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు జరిగే ప్రధాని మో దీ జనసభలో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పా ల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి అమర్‌, జర్నలిస్టు సంఘాల నేతలు గడ్డం రాజిరెడ్డి, గాడిపల్లి మధు, బీఆర్‌ లెనిన్‌, దయాసాగర్‌, ఎం. రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

నాన్‌ లోకల్‌ అభ్యర్థులకు ఓటువేయకండి

కడియం శ్రీహరిది నీచ చరిత్ర

బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్‌

Advertisement
Advertisement