![ప్రాణ](/styles/webp/s3/article_images/2024/07/1/30stg204-330071_mr-1719777663-0.jpg.webp?itok=b8WELdcv)
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
నెల్లికుదురు : వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది.. అవమానభారంతో పురుగుల మందు తాగిన దంపతుల్లో భార్య మృతి చెందగా భర్త చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పెద్దతండాలో జరిగింది. ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. పెద్దతండాకు చెందిన బానోత్ నీలమ్మ (36)కు అదే తండాకు చెందిన బానోత్ వీరన్నతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయంలో నీలమ్మ భర్త భద్రు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. వీరన్న మళ్లీ నీలమ్మ వద్దకు రావొద్దని పెద్దమనుషులు తీర్మానం చేశారు. అయినా వీరన్న మారకుండా ఈ నెల 29న రాత్రి నీలమ్మ ఇంటికి వెళ్లి బలవంతం చేయబోయాడు. దీంతో దంపతులు.. వీరన్నను బతిమిలాడి తమ పరువు తీయొద్దని ఎంత ప్రాధేయ పడినా వినలేదన్నారు. అంతేకాకుండా నీలమ్మతో తనకు వివాహేతర సంబంధం కొనసాగుతోందని తండాలో ప్రచారం చేస్తున్నాడు. దీంతో మనస్తాపం చెంది అవమాన భారం భరించలేక దంపతులు ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా నీలమ్మ మృతి చెందింది. భద్రును తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు బాదావత్ కిషన్ ఫిర్యాదు మేరకు బానోతు వీరన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై క్రాంతికిరణ్ తెలిపారు.
వినియోగదారుడిపై బంక్ యజమానుల దాడి
రఘునాథపల్లి: డీజిల్ పోసుకుని ఇచ్చిన రూ. 500 నోటు చెల్లదని నెలకొన్న వివాదంలో ఓ వినియోగదారుడిపై పెట్రోల్‌బంక్ యజమానులైన తండ్రీకొడుకుడు దాడి చేసిన ఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గండికోట శేఖర్ తన ట్రాక్టర్‌లో డీజిల్ కోసం బస్టాండ్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. రూ. 470 డీజిల్ పోసుకుని రూ. 500 నోటు ఇచ్చాడు. మిగతా రూ .30 ఇవ్వాలని శేఖర్ అడగగా రూ. 500 నోటు చెల్లదని బంక్ సిబ్బంది నిరాకరించారు. దీంతో బంక్ సిబ్బంది, శేఖర్ మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న బంక్ యజమాని, రిటైర్డ్ డీఎస్పీ నర్సయ్య, అతడి కుమారుడు ఆగ్రహంతో ట్రాక్టర్‌పై ఉన్న శేఖర్‌పై దాడి చేశాడు. దాడి సమాచారం అందుకున్న శేఖర్ కుటుంబీకులు, స్థానికులు బంక్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. పోలీసులు చేరుకుని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధితుడు శేఖర్ ఫిర్యాదు మేర కు బంక్ యజమానులు, రిటైర్డ్ డీఎస్పీ నర్సయ్య, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ తెలిపారు.
● అవమానభారంతో పురుగుల మందుతాగిన దంపతులు..
● భార్య మృతి, చికిత్స పొందుతున్న భర్త.. పెద్దతండాలో ఘటన
● వివరాలు వెల్లడించిన ఎస్సై క్రాంతికిరణ్..
![ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
1](https://www.sakshi.com/gallery_images/2024/07/1/30mbd251-330025_mr-1719777663-1.jpg)
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
Comments
Please login to add a commentAdd a comment