గూడూరు: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రవీందర్‌రెడిడ అన్నారు. మండలంలోని పలు ప్రభుత్వ హైస్కూళ్లతో పాటు అరవింద, మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల విద్యాలయాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా విద్యార్థుల శక్తి సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతీ పాఠశాలలో అపార్ జనరేషన్ ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని సూచించారు. అరవింద విద్యాలయంలో అపార్ జనరేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఎంఈఓ రవికుమార్, జిల్లా స్టాటికల్ అధికారి పూర్ణచందర్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
శాస్త్రవేత్తలుగా ఎదగాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్‌లో సోమవారం జిల్లాస్థాయి ఫిజికల్‌సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ రవీందర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రకాల టాలెంట్ టెస్టులకు హాజరుకావాలని సూచించారు. విహార యాత్రలను విజ్ఞాన యాత్రలుగా మలుచుకోవాలన్నారు. టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు డీఈఓ బహుమతులు అందజేశారు. జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్‌రావు, ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు అనిల్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఏఎంఓ చంద్రశేఖర్ ఆజాద్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, గాయత్రి, ఝాన్సీ, భిక్షపతి, ప్రకాశ్, గంగాధర్, రవీందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
గూడూరు హైస్కూల్‌లో విద్యార్థులతో
మాట్లాడుతున్న డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment