![ఈపాస్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/11022025-mbd_tab-07_subgroupimage_1883321952_mr-1739217174-0.jpg.webp?itok=RCSrAk0y)
ఈపాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయించాలి
మహబూబాబాద్ రూరల్ : షాపుల నిర్వాహకులు ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే రైతులకు ఎరువులు విక్రయించాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. దుకాణాల యజమానులు రైతులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే ఎరువుల షాపుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ పాస్ మిషన్ వివరాలు చూసినప్పుడు లెక్కలు సరిగా ఉండాలన్నారు. రైతులు డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, టెక్నికల్ ఏఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా పూర్ణచందర్‌రెడ్డి
తొర్రూరు: తొర్రూరు ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా వై.పూర్ణచందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎంపీడీఓగా పని చేసిన నర్సింగరావు అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కాగా ఆయన స్థానంలో ఎంపీఓ పూర్ణచందర్‌రెడ్డికి ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా బాధ్యతలు అప్పగించారు. పూర్ణచందర్‌రెడ్డికి మండల పరిషత్ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు శుభాకాంక్షలు తెలిపారు.
పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి
నెహ్రూసెంటర్: జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ మురళీధర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్‌పై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌బీఎస్‌కే రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని స్కూల్స్, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలందరినీ స్క్రీనింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రమీల, ప్రోగ్రాం ఆఫీసర్స్ లక్ష్మీనారాయణ, సారంగం, శ్రవణ్‌కుమార్, సుధీర్‌రెడ్డి, విజయ్‌కుమార్, కుమార్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, కేవీ రాజు, గీత, శారద, ఆర్‌బీఎస్‌కే సిబ్బంది, డీఈఐ సిబ్బంది పాల్గొన్నారు.
న్యాక్ బృందం పరిశీలన
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ గురుకుల కళాశాలను నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్ కౌన్సెలింగ్ (న్యాక్)పీర్ బృందం ఆదివారం రాత్రి పరిశీలించింది. డైనింగ్ హాల్, తరగతి, విద్యార్థులు గదులు, వంటశాలను సభ్యులు తనిఖీ చేశారు. విద్యార్థులను మౌలిక వసతుల, భోజనం, లైబర్రీ, సైన్స్ ప్రయోగశాలలు, బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్సీఓ హరిసింగ్ మాట్లాడుతూ.. న్యాక్ బృందం పరిశీలనతో కళాశాల అప్‌గ్రేడ్ సాధిస్తే మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీఓ నారాయణనాయక్, కళాశాల ప్రిన్సిపాల్ బిందు, వైస్ ప్రిన్సిపాల్ దివ్య, ఓఎస్టీ సతీష్, ఐక్యూఏసీ లావణ్య, కాకతీయ యూనివర్సిటీ పరీక్షల అదనపు నియంత్రణాధికారి సంధ్యారాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
![ఈపాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయించాలి
1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10mbd451-330154_mr-1739217174-1.jpg)
ఈపాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయించాలి
Comments
Please login to add a commentAdd a comment