![‘అధిక సాంద్రత’ పత్తి సాగు లాభదాయకం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10drk103-330034_mr-1739217175-0.jpg.webp?itok=TeYVFdv_)
‘అధిక సాంద్రత’ పత్తి సాగు లాభదాయకం
కురవి: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ అధికారి ఎం.విజయ నిర్మల అన్నారు. సోమవారం మండలంలోని బలపాల గ్రామంలోని రైతు వేదికలో రాజోలు, బలపాల, లింగ్యాతండా (బి) రైతులకు అధిక సాంద్రత పత్తి పంట, మెరుగైన యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచి ఒకే సారి పంట కోత కోసేలా పంట కాలాన్ని తగ్గించి, అలాగే గులాబీ రంగు పురుగు బారినుంచి తప్పించుకోవాలని సూచించారు. కేవీకే కో–ఆర్డినేటర్ మాలతి మాట్లాడుతూ.. సరైన సమయంలో మెపిక్వాట్ క్లోరైడ్‌ను పిచికారీ చేసినట్లయితే అధికంగా దిగుబడి సాధించవచ్చని తెలిపారు. రైతులు కోతుల నుంచి బాధపడుతున్నారని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి.వీరన్న, శాస్త్రవేత్త కిషోర్, ఏఓ నరసింహ, ఏఈఓ లయ, రైతులు అంబటి వెంకటనారాయణ, శ్రీనివాస్, లింగ్యానాయక్, బానోత్ రమేశ్ పాల్గొన్నారు.
డీఏఓ విజయనిర్మల
Comments
Please login to add a commentAdd a comment