కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోలో బుధవారం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్’ అంశంపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల 17వ నేషనల్ వర్క్‌షాప్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా పాల్గొని సాఫ్ట్‌వేర్‌లో చోటు చేసుకున్న నూతన ట్రెండ్స్‌పై పరిశోధనలు చేపట్టేందుకు వేదికగా వర్క్‌షాప్ నిలవాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సోమేన్‌కుమార్ రాయ్, దుర్గాప్రసాద్, సంజయ్‌కుమార్ పాండా తదితరులు పాల్గొన్నారు.
పారాతైక్వాండో పోటీల్లో గౌతమ్‌కు గోల్డ్‌మెడల్
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 24 నుంచి 27 వరకు బహ్రెయిన్‌లో జరిగిన ప్రపంచ పారా పూమ్సే తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హనుమకొండ పైడిపెల్లికి చెందిన ఎల్లావుల గౌతమ్‌యాదవ్ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పీ–51 సీనియర్ పురుషుల విభాగంలో ఇండివిజువల్ కేటగిరీలో గౌతమ్‌యాదవ్ బంగారం పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. తెలంగాణ నుంచి పారాతైక్వాండో బంగారు పతకం సాధించిన మొదటి వ్యక్తి కావడం విశేషం. భారత తైక్వాండో ప్రెసిడెంట్ నామ్‌దేవ్, వైస్ ప్రెసిడెంట్ వీనాకుమారి, తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ రవి, జనరల్ సెక్రటరీ గణేశ్‌యాదవ్ ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment