గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2024 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

Published Thu, Nov 28 2024 1:34 AM | Last Updated on Thu, Nov 28 2024 1:34 AM

గురువ

గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

8లోu

అమలు కాని మెనూ..

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని నందమూరి నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో 98 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించలేదు. బీరకాయ కూరతో విద్యార్థులకు భోజనం వడ్డించారు. అదేవిధంగా జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో 485 మంది విద్యార్థినులకు కూడా మెనూ పాటించకుండా వంకాయ కర్రీతో భోజనం అందించారు. కోడిగుడ్లు అందించలేదు. ప్రభుత్వ బాలుర పాఠశాలలో 420 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ అదే పరిస్ధితి నెలకొంది. సోరకాయ కర్రీ వండారు. ఉడికీ ఉడకని అన్నం.. చప్పటి కూరలు, నీళ్ల చారు.. రుచికరమైన భోజనం అందడం లేదని విద్యార్థులు వాపోయారు.

అన్నం బాగుండదు..

మా పాఠశాలలో అన్నం బాగుండదు. కూర నీళ్లుగా ఉంటుంది. చారు కూడా పలుచగా ఉండడంతో పాటు అన్నం తక్కువగా పెడతారు. ముందు ఎంపీపీఎస్‌ విద్యార్థులకు అన్నం వడ్డించారు. మేము తర్వాత వెళ్లేసరికి అన్నం అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. రెండు బడులకు కలిపి ఒకేచోట అన్నం వండటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కోడిగుడ్లు వారానికి రెండుసార్లు పెడుతున్నారు.

– మాలోత్‌ విష్ణు, తొమ్మిదో

తరగతి విద్యార్థి, ముడుపుగల్‌

జెడ్పీహెచ్‌ఎస్‌

అన్నం సరిపడా పెట్టడం లేదు..

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలం ముడుపుగల్‌లో ఒకే ఆవరణలో ఎంపీపీఎస్‌, జెడ్పీ ఉన్న త పాఠశాలలు ఉన్నాయి. కాగా రెండు పాఠశాలల విద్యార్థులకు కలిపి ఎంపీపీఎస్‌ కిచెక్‌ షెడ్‌ వద్ద మధ్యాహ్న భోజనం వండుతున్నారు. అయితే భోజనం నాణ్యతగా ఉండటం లేదని, నీళ్ల చారు పోస్తున్నారని, కూరలు కూడా సరిగా పెట్టడంలేదని, అన్నం అంతతమాత్రంగానే పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. ఒక్కోసారి అన్నంలో లక్కపురుగులు, రాళ్లు వస్తుంటాయని తాము అడిగితే ఎవరు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. వంటకు మిషన్‌ భగీరథ నీళ్లు వాడుతున్నారు. కాగా ముందుగా ఎంపీపీఎస్‌ విద్యార్థులకు, తర్వాత జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్నం పెడుతున్నారని పేర్కొన్నారు. దీంతో తాము వెళ్లేసరికి అన్నం ఉండడంలేదని, తక్కువగా పెడుతున్నారని జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు వాపోయారు. వారానికి రెండుసార్లు మాత్రమే కోడిగుడ్లు పెడుతున్నారని చెప్పారు.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 20241
1/3

గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 20242
2/3

గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 20243
3/3

గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement