రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కొత్తగూడ: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని పొగుళ్లపల్లి, ఓటాయి, కోనాపూర్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన పడి వ్యాపారుల వద్ద మోసపోవద్దని అన్నారు. ధాన్యం నింపడానికి బస్తాలు ఇవ్వడం లేదని, 1271 రకం ధాన్యం సన్నరకం కింద తీసుకోవడం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు కంటే దొడ్డుగా వస్తున్నట్లు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తెలిపారు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన సన్న రకాల్లో ఉన్నందున్న గ్రేడ్–ఏలో తీసుకునే విధంగా చూస్తామని అన్నారు. ఽతహసీల్దార్ రమాదేవి, మండల స్పెషల్ ఆఫీసర్ సురేష్, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఏఓ ఉదయ్, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ఏఈఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మద్దతు ధర పొందాలి
గంగారం: ధాన్యంలో తాలు, చెత్త లేకుండా తీసుకొచ్చి రైతులు మద్దతు ధర పొందాలని కలెక్టర్ అధ్వైత్ సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని కోమట్లగూడెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం అగ్రికల్చర్ అసిస్టెంట్, టెక్నిల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌లను ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆతర్వాత ఆశ్రమోన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను తనిఖీ చేశారు. తరగతి గదులు, డ్రైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్‌లను పరిశీలించి, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment