మహబూబాబాద్ అర్బన్: ఈనెల 30, డిసెంబర్ 1వ తేదీన జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్(ఇన్‌స్పైర్ మనాక్ అవార్డ్స్ ప్రదర్శన) నిర్వహించనున్నట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆహారం, ఆరోగ్యం, శుభ్రత, రవాణా, కమ్యూనికేషన్స్, సేంద్రియ వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, గణిత నమూనా, వ్యర్థాల నిర్వహణ, వనరుల నిర్వహణ అనే ఉప అంశాలపై ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించాలన్నారు. జిల్లా కేంద్రంలోని అనంతారం తెలంగాణ ఆదర్శ పాఠశాలలో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రదర్శనలకు ఎంపికై న విద్యార్థులు ఎగ్జిబిట్స్ తయారు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులను మాత్రమే ఎగ్జిబిట్లను తిలకించేందుకు తీసుకురావాలని సూచించారు. ఈనెల 30న డోర్నకల్, గార్ల, బయ్యారం, కురవి, సీరోలు, మరిపెడ, దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాల విద్యార్థులు.. డిసెంబర్ 1న మహబూబాబాద్, కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, కొత్తగూడ, గంగారం, తొర్రూరు, ఇనుగుర్తి, పెద్దవంగర మండలాల విద్యార్థులు ఎగ్జిబిట్లను తిలకించడానికి రావాలన్నారు. అన్ని యాజమాన్యాల రెసిడెన్షియల్ విద్యార్థులు ఆదివారం రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని 9849598281 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment