మార్కెట్‌కు 11వేల ధాన్యం బస్తాల రాక
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు ఈ సీజన్‌లో అత్యధికంగా 11వేల ధాన్యం బస్తాలు బుధవారం అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌కు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు తమ ధాన్యం బస్తాలను ట్రాక్టర్ల ద్వారా మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఈ మేరకు షెడ్లు నిండిపోగా ఓపెన్ యార్డులలో ధాన్యాన్ని రాశులుగా పోశారు. కాగా జైశ్రీరాం రకం ధాన్యానికి గరిష్ట ధర రూ.3వేలు, కనిష్ట ధర రూ.2,729, ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యానికి గరిష్ట ధర రూ.2,702, కనిష్ట ధర రూ.2,411, హెచ్‌ఎంటీ రకం ధాన్యానికి గరిష్ట ధర రూ.2,589, కనిష్ట ధర రూ.2,401 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వ్యవసాయ మార్కెట్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేసముద్రం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
5,294 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ధాన్యం రాశులతో బుధవారం కళకళలాడింది. మంగళవారం 3,862 క్వింటాళ్ల (5,941 బస్తాలు) ధాన్యం కొనుగోళ్ల్లు జరుగగా.. బుధవారం 5,294 క్వింటాళ్ల(8,144 బస్తాలు) ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులు అధిక మొత్తంలో ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకురాగా వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం మొత్తం బంగారు వర్ణంలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment