28న జాబ్‌మేళా
గూడూరు: ఈ నెల 28న ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మ హబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రా రంభమయ్యే ఈ మేళాకు పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదివిన నిరుద్యోగులు హాజరు కావాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వివరాలకు సెల్ 8330954571 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
సౌత్‌జోన్ క్రికెట్ టోర్నమెంట్‌కు కేయూ మహిళా జట్టు
కేయూ క్యాంపస్ : మైసూర్ యూనివర్సిటీలో ఈనెల 23నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేశామని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై. వెంకయ్య బుధవారం తెలి పారు.ఈజట్టులో ఎం నవ్య (కెప్టెన్), జి మోహనశ్రీ, జె. అనూష ,బి. నవ్య, బి.లీషా, టి. అశ్వత, వి. సుజాత వై.రచిత, ఎం. దాత్రిశ్రీ, పి. సరిత, ఎస్. జయశ్రీ, ఎస్. తుష్మరేఖ, డి. యశస్విని, ఎం. సౌమ్యశ్రీ, పి. శ్రీనిధి, బి. మంజుల ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈ జట్టు కు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎండి. అఫ్జల్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.
మధుప్రియపై కేసు నమోదు చేయాలి
● దేవస్థానం కార్యాలయం ఎదుట
బీజేపీ నాయకుల ధర్నా
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం గర్భగుడిలో సింగర్ మధుప్రియ ప్రైవేట్ పాట చిత్రీకరించిన నేపథ్యంలో ఆమెతో పాటు బృందంపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకుడు చల్లా నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వ రం దేవస్థానం కార్యాలయం ఎదుట కార్యకర్తలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈఓ, మ ధుప్రియ, వారి బృంద సభ్యులపై దేవాదాయశాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత దేవస్థాన అధికారులపై ఉందన్నారు. అనంతరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకు ముందు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, ఆర్జేసీ రామకృష్ణరావుతో ఘటనపై మాట్లాడారు. చర్యలు తీసుకోవాలని విన్నపించారు. మండల అధ్యక్షుడు మనోజ్, కిషన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment