క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
● పెద్ది వెంకటనారాయణ
కాజీపేట రూరల్: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమని, నేటి ఆధునిక జీవన విధానంలో తగ్గిపోతున్న క్రీడల ప్రాధాన్యత పెంపుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్, జనగామ జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ అన్నారు. కాజీపేట రైల్వే స్టేడియంలో రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో లోకో 11 జట్టు– ఇంజనీరింగ్ జట్టు మధ్య క్రికెట్ పోటీని బుధవారం పెద్ది వెంకటనారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులకు క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి రైల్వే ఉద్యోగులకు కావాల్సిన సహకారం అందిస్తామని తెలిపారు. రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ ఆర్డీఎం జట్టు–రైల్వే ఇన్‌స్టిట్యూట్ జట్ల మధ్య పోటీని ప్రారంభించి మాట్లాడారు. క్రీడలను మానసికోల్లాసమే కాకుండా బాల్యస్మృతులను గుర్తు చేస్తాయన్నారు. క్రీడలతో ఆరోగ్య సమస్యలకు చెక్‌పెట్టొచ్చని అభిప్రాయపడ్డారు. మొదటి మ్యాచ్‌లో రైల్వే ఇన్‌స్టిట్యూట్ జట్టుపై ఆర్డీఎం జట్టుజట్టు గెలిచింది. రెండో మ్యాచ్‌లో లోకో –11 జట్టు విజయం సాధించింది. కార్యక్రమంలో రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, జాయింట్ సెక్రటరీ ఎం.రాజయ్య, కోశాధికారి గిరిమిట్ల రాజేశ్వర్, కల్చరల్ విభాగాల ఇన్‌చార్జ్ దారవత్ రఘు, క్రికెట్ క్రీడల విభాగాల ఇన్‌చార్జ్ పి.ప్రశాంత్, కమిటీ సభ్యులు ఎస్.ప్రవీణ్, పి.రవికిరణ్, సుంచు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment