తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్..
వరంగల్ క్రైం: తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి నిందితుడి నుంచి సుమారు రూ. 50 వేల విలువైన ఐదు గ్రాముల బంగారు, 61 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూ ర్‌నగర్ మండలం కరక్కాయల గూడెం గ్రామానికి చెందిన సన్నిధి ఆంజనేయులు రోజువారీ కూలి పనిచేస్తూ వచ్చే ఆదాయంతో జల్సాలు చేసేవాడు. అయితే జల్సాలకు ఆదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సుబేదారి పీఎస్ పరిధిలోని చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలో ఇటీవల తాళం చేసి ఉన్న ఇంటిలో ఐదు గ్రా ముల బంగారు, 61 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 60 వేల నగదు అపహరించాడు. నిందితుడు గతంలోనూ పలుమార్లు చోరీలకు పాల్పడడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ క్ర మంలో బుధవారం మరోసారి చోరీకి పాల్పడేందు కు హంటర్ రోడ్డులోని సీఎస్‌ఆర్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
చైన్‌స్నాచర్ అరెస్ట్..
చైన్‌స్నాచర్‌ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.3.60 లక్షల విలువైన 45 గ్రాముల బంగారు గొలుసుతో పాటు ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండల కేంద్రానికి చెందిన ములక విజయ్‌కుమార్ మంగళవారం మధ్యాహ్నం కొత్తూరు జెండా ప్రాంతంలో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు హనుమకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన హనుమకొండ, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా.. టెక్నాలజీ సాయంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేసి చోరీ చేసిన బంగారు గొలుసును స్వా ధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడు ఖమ్మం, జ నగామ, వరంగల్, కాజీపేట, పర్వతగిరి, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు ఏసీపీ పేర్కొన్నారు.
చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
వివరాలు వెల్లడించిన సుబేదారి
ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment