
మహబూబ్‌నగర్: రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్‌ఐ సయ్యద్ అక్భర్ కథనం ప్రకారం..మహబూబ్‌నగర్‌లోని బండ్లగేరికి చెందిన సయ్యద్ ముజఫర్(22) శనివారం పట్టణంలోని వీరన్నపేట సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
తలతో పాటు కాళ్లు, చేతులు పూర్తిగా తెగిపోవడంతో గుర్తించలేనివిధంగా మారింది. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగానికి తరలించారు. అయితే మృతి చెందిన యువకుడు డిగ్రీ పూర్తి చేసి తండ్రితో పాటు ఇటుకల వ్యా పారం చేస్తున్నాడు. మృతుడి కుటుంబసభ్యు లు సయ్యద్ ముజఫర్ మృతిపై అనుమానం ఉందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.