ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి

Published Wed, May 8 2024 3:55 AM

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ/మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: లోక్‌సభ ఎన్నికల్లో విధులు సక్రమంగా నిర్వర్తించాలని కేంద్ర సాధారణ పరిశీలకులు షెవాంగ్‌ గ్యాచో భూటియా సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీయార్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఓలు, ఏపీఓలకు ఏర్పాటు చేసిన రెండో విడత శిక్షణ శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిబంధనలు, మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే శిక్షణలో నివృత్తి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈనెల 13న పోలింగ్‌ ప్రక్రియ ను సజావుగా నిర్వహించాలన్నారు. ఈవీఎంలలో నమోదైన ఓట్ల వివరాలు ఫారం 17సి, పీఓ డైరీ, పీఓ రిపోర్టును జాగ్రత్తగా పూరించాలన్నారు. పోలింగ్‌కు ముందు మాక్‌పోల్‌ నిర్వహించి క్లియర్‌ చేసిన తర్వాతే నిర్ణీత సమాయానికి ప్రక్రియ చేపట్టాలన్నారు. పోలింగ్‌ శాతం నివేదిక ప్రతి రెండు గంటలకోసారి సమర్పించాలన్నారు. ఈ శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి ఈనెల 8న శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్‌ జి.రవినాయక్‌, డీఈఓ రవీందర్‌ పాల్గొన్నారు.

సాధారణ పరిశీలకులు

షెవాంగ్‌ గ్యాచో భూటియా

రెండో విడత శిక్షణ శిబిరం పరిశీలన

Advertisement
 
Advertisement
 
Advertisement