బాధిత కుటుంబానికి పరామర్శ
కల్వకుర్తి టౌన్: ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో శనివారం బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరంగా చావును సైతం రాజకీయాలకు వాడుకోవటం సిగ్గుచేటని.. కాంగ్రెస్‌పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
సమగ్ర విచారణ జరిపించాలి..
సాయిరెడ్డి ఆత్మహత్యపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాలు వేరైనా చట్టాలు అందరికీ ఒక్కటేనని.. మృతిపై ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ చేపట్టాలన్నారు. 85 ఏళ్ల వయసులో ఒక మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే సీఎం సోదరులు ఎంత ఇబ్బంది పెట్టారో అర్థమవుతుందని తెలిపారు. మరణ వాంగ్మూలాన్ని ఉత్తరం రూపంలో తెలియజేసినా.. మృతికి కారణమైన వారందరిపై కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment