ఉత్సాహంగా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షుడు అమరేందర్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి శరత్‌చంద్ర మాట్లాడుతూ జిల్లాస్థాయి ఎంపికల్లో జిల్లావ్యాప్తంగా దాదాపు 250 మంది బాల, బాలికలు హాజరయ్యారన్నారు. మంచిర్యాలలో వచ్చేనెల 1న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయన్నారు. జట్టు తుది జాబితాను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కోచ్‌లు ఆనంద్‌కుమార్, సాధిక్‌అలీ, సునీల్‌కుమార్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం సంయుక్త కార్యదర్శులు కె.రమేశ్‌బాబు, పి.శ్రీనివాసులు, పి.శ్రీనివాసులు, పీడీ మేరిపుష్ప పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ క్రీడాంశాలు
జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో అండర్– 8లోపు విభాగం బాల, బాలికలకు 50 మీ., 300 మీటర్ల పరుగు, స్టాండింగ్ బ్రాడ్ జంప్, అండర్– 10లోపు విభాగంలో 100 మీ., 300 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, అండర్– 12 విభాగంలో 100 మీ., 400 మీ., 600 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ అంశాల్లో ఎంపికలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment