ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 5వ గిరిజన క్రీడోత్సవాలు గురువారంతో ముగిశాయి. హోరాహోరీగా సాగిన అథ్లెటిక్స్ పోటీల్లో భద్రాచలం జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ సా ధించగా ఉట్నూర్ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ట్రెయినీ కలెక్టర్ అభిజ్ఞాన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, స ర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీల్లో 1600 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమన్నారు. క్రీడల్లో రా ణించేందుకు అన్నిరకాల సహకారాలు అందిస్తామన్నారు. పీవో మాట్లాడుతూ క్రీడాకారులు ఇదే స్ఫూ ర్తితో ముందుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా జాతీ యస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు వరంగల్ జిల్లా కు చెందిన వెంకట నారాయణను సన్మానించారు. అంతకు ముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎస్‌వో పార్థసారథి, నిర్మల్ జిల్లా గిరిజన క్రీడల అధికారి రమేశ్, ఆయా జిల్లాల పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన భద్రాచలం జట్టు
ద్వితీయస్థానంలో నిలిచిన
ఉట్నూర్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment