బీసీ వసతిగృహాల వార్డెన్లకు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడేసి హాస్టళ్ల ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. పక్క పక్క మండలాలకు చెందిన వారి కి కాకుండా దూరంగా ఉండే వారికి అప్పగించడం వల్ల పర్యవేక్షణ ఎలా ఉంటుందో తెలియకుండా పోతోంది. వార్డెన్లు పక్క జిల్లా నుంచి వచ్చి వెళ్తుంటారనే ఆరోపణలు లేకపోలేదు. మంచిర్యాల వార్డెన్ ఒకరికి చెన్నూర్‌లో రెండు, మరొకరికి జైపూర్, బెల్లంపల్లికి చెందిన వార్డెన్‌కు లక్సెట్టిపేట ఇవ్వడం వల్ల అవకాశంగా మారుతోంది. నిరంతరం వసతిగృహంలో ఉంటేనే పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉంటుండగా అదనపు బా ధ్యతల వల్ల ఏదో చోట ఉన్నామంటూ తప్పించుకుంటున్నారు. ఎస్సీ వసతిగృహాల్లో కూడా చెన్నూర్, బెల్లంపల్లి వైపు ఒకటి రెండు చోట్ల సరిగ్గా మె నూ అమలు చేయడం లేదని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని ఎస్టీ వసతిగృహాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బాలుర వసతిగృహంలో అన్నింటినీ సీనియర్ విద్యార్థులతోనే చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. బాలికల వసతిగృహంలో ఫుడ్‌పాయిజన్ కావడం తెలియంది కాదు. మెనూ అమలుపై ఆయా శాఖల పర్యవేక్షణ అధికారులు న్నా అటు వైపు చూస్తున్న సందర్భాలు తక్కువ. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment