మద్దతు ధరపై అవగాహన ఉండాలి
కోటపల్లి: పత్తి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర పొందడంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. సోమవారం మండలంలోని మల్లంపేట రైతు వేదికలో రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పొలాల్లోనే నాణ్యత ప్రమాణాలు వచ్చే వరకు ఆరబెట్టి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ సీజన్ నుంచి ప్రభుత్వం సన్నవడ్లకు రూ.500 బోనస్‌గా ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో మహేందర్, ఏఈవోలు వైష్ణవి, అనూష, రాజుకుమార్, పీఏసీఎస్ చైర్మన్ సాంబగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment