పిల్లలను బడిలో చేర్పించాలి
మంచిర్యాలక్రైం: బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. స్థానిక పాత మంచిర్యాల ప్రభు త్వ పాఠశాలలో సోమవారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో చాలామంది బడీడు పిల్లలు కూలీ పనులకు వెళ్తున్నారని అ న్నారు. ప్రభుత్వాలు సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నాయని, మధ్య తరగతి ప్రజలు వినియోగించుకోవాలని అన్నా రు. బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ ని ర్మూలన, బాలల చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం కోసం 15100 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపా రు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment