ఆర్టీసీలో సౌరకాంతులు
● పగలంతా సోలార్ పవర్
● విద్యుత్ బిల్లులు ఆదా
● పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. కరెంటు బి ల్లుల భారాన్ని తగ్గించుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. పగలంతా సో లార్ విద్యుత్‌తో పనులు చక్కబెట్టుకుంటూ విద్యుత్ ఆదా చేస్తోంది. ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ మంచిర్యాల ఆర్టీసీ బస్‌స్టేషన్, డిపో గ్యారేజ్ భవనాలపై రూఫ్‌టాప్ ప్లాంట్లు నెలకొల్పి సౌర వెలుగుల బాట పట్టింది.
ఏర్పాటు ఇలా..
జిల్లాలో ఏకై క డిపో మంచిర్యాలలో 151 బస్సులు ఉన్నాయి. 62వేల కిలోమీటర్లకు పైగా తిప్పుతూ 63వేల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానా లకు చేరవేస్తున్నారు. బస్‌స్టేషన్, డిపోలో వివిధ అ వసరాలకు విద్యుత్ తప్పనిసరి. ఇందులో భాగంగా 2020 జనవరి నుంచి బస్‌స్టేషన్ రూఫ్‌పై 14.5 కిలో వాట్స్, గ్యారేజ్‌పైన 10 కిలోవాట్స్ సౌర వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థతో ఒప్పందం ప్రకారం 30 ఏళ్లపాటు మెనర్స్ కార్విక్ కన్సెల్టెన్సీ పర్యవేక్షిస్తోంది. ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు యూనిట్‌కు రూ.5.00 చొప్పున తక్కువగా అంది స్తోంది. పగలంతా సోలార్ విద్యుత్ వినియోగిస్తుండగా రాత్రి ఎన్‌పీడీసీఎల్ కరెంటు వాడుతున్నారు. దీంతో సగానికి పైగా విద్యుత్ బిల్లుల భారం తగ్గుతోంది. 2020 జనవరి తర్వాత సౌర విద్యుత్ విని యోగంతో బిల్లులు సగానికి తగ్గాయి.
భారం పడకుండా..
సోలార్ విద్యుత్ వినియోగంతో ఆర్టీసీపై విద్యుత్ బిల్లుల భారం తగ్గుతోంది. కాలుష్య నివారణతోపాటు చార్జీల భారం 50శాతం మేర తప్పుతోంది. ఖాళీస్థలాల్లో ఆర్టీసీ చేపట్టిన ప్రయోగం విజయవంతం అవుతోంది. సోలార్ పవర్‌తో పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు.
– జనార్దన్, ఆర్టీసీ డీఎం, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment